సాంస్కృతిక, సహజ వనరుల శిక్షణ ఎంపిక

*అభినందించిన డీఈవో ఎంఈఓ.

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 భూమయ్య పిట్లం .. పిట్లం మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కారేగాం పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ భావన ఉపాధ్యాయురాలు సాంస్కృతిక మరియు సహజ వనరుల సంరక్షణ అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించబడుతున్న శిక్షణ కార్యక్రమానికి ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శిక్షణను సీర్ట్ తెలంగాణ ద్వారా సెంట్రల్ ఆఫ్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ న్యూఢిల్లీ నిర్వహిస్తున్నారని , ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం భారతదేశ సంస్కృతి ,వారసత్వం , సహజ వనరుల ప్రాముఖ్యత పై అవగాహన పెంపొందించడం అన్నారు. పాఠశాల స్థాయిలో స్థానిక సంస్కృతి , సంప్రదాయాలు, కళారూపాలు, ప్రకృతి సంరక్షణ ,విలువలు బోధనలో భాగంగా చేర్చడం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే అలవాటు ను పెంపొందించవచ్చని ఈ శిక్షణ ద్వారా స్పష్టమవుతుందని అన్నారు. ఈ శిక్షణకు ఎంపికైన సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ రాజు మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ ఎంఈఓ మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మేడం గారికి అభినందనలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *