సాక్షి,డిజిటల్ న్యూస్, మరికల్, ఫిబ్రవరి,14, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ సౌజన్యంతో మేరా యువ భారత్- మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ధన్వాడ మండలం కొండాపూర్ పీఎం శ్రీ గిరిజన గురుకులంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా యువజన అధికారి వి. కోటా నాయక్, గురుకులం ప్రిన్సిపల్ ఎం. రాజారాం ఈ క్రీడా పోటీలను ప్రారంభిం చారు. కబడ్డీ, వాలీబాల్, నెట్ బాల్, పోటీలలో గెలిచిన వారికి మేమెంటో, సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరిక ధారుడ్యానికి, మానసిక వికాసానికి ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో నెట్ బాల్ కోచ్ డాక్టర్ రామ్మోహన్ గౌడ్ పీఈటీ ఆంజనేయులు అధ్యాపకులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
