గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవాలి …. సిడిపిఓ 

సాక్షి డిజిటల్ బాలాయపల్లి :గర్భవతులు  పౌష్టికాహారం తీసుకోవడం వల్ల  పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని  స్త్రీ సంక్షేమ శాఖ సిడిపిఓ  శంషాద్ బేగం పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న అగన్ వాడి కేంద్రంలో గర్భవతులకు  పౌష్టిక ఆహారంపై  సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5వ నెల నుంచి  గర్భవతులు ప్రతి  నెల  వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇస్తున్న టీకాలు వేయించుకోవాలని కోరారు .అంగన్వాడి కేంద్రం ద్వారా అందజేస్తున్న పౌష్టికా హారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు. గర్భవతులుగా ఉన్న సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం  వంతమైన బిడ్డ పుట్టతారని చెప్పారు. అనంతరం పలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో  అంగన్వాడి కార్యకర్తలు గర్భవతులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *