డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు జిల్లా మలేరియా అధికారి రజిని ఈరోజు మహానగర పాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేశాయిపేట లో గల ఎమ్మెస్ నగర్ లో నమోదైన డెంగ్యూ పాజిటివ్ కేసు ఇంటిని జిల్లా మలేరియా అధికారి రజిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డెంగ్యూ వ్యాధిగ్రస్తుడు హర్ష ను ఆరోగ్య వివరాలు తెలుసుకుని, డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి నిరోధక చర్యల గురించి తెలియజేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఉండటానికి నీటి నిలువలను తొలగించాలని మరియు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ భరత్, ఆరోగ్య విస్తరణ అధికారులు విజయేంద్ర కుమార్, సదానందం, వైద్య సిబ్బంది , పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెలు స్థానిక ఏఎన్ఎం, శోభ ఆశా కార్యకర్త ప్రమీల మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *