అందోల్ ఫిబ్రవరి 13 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య) అందోల్ మండలం లోని నేరడిగుంట గ్రామంలో మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి సర్పంచిగా గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్న ఒగ్గు సాయి కిరణ్ యాదవ్. గ్రామపంచాయతీ లేబర్స్ లకు జీతాలు రాక నాన్న అవసరం పడుతున్నారు. సర్పంచిగా గెలిచిన ఒగ్గు సాయికిరణ్ యాదవ్ మీకు జీతాలు గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకుండా నేను గెలిచిన తర్వాత నా సొంత డబ్బులు మీకు జీతాలు అందజేస్తానని మాయమాటలు చెప్పి గెలుపొందారు. గత మూడు నాలుగు నెలల నుండి జీతాలు రాక నానా అవస్థ పడుతున్న లేబర్స్ లను పట్టించుకోవడం లేదు . జీతాలు అడిగితే ముఖం చాటేస్తున్నాడు. పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ కుమ్మకై గ్రామపంచాయతీలో ఒంటెద్దు పోకడ పోతున్నారు. మా పిల్లలు ఎలా బతకాలి చాలీచాలని జీతాలతో మా కుటుంబం ఎలా బ్రతుకుతామని వారు అంటున్నారు . మాకు జీతాలు ఇవ్వాలని గ్రామపంచాయతీ లేబర్స్ వారి గోడు వినిపిస్తున్నారు. గెలువక ముందు నా సొంత డబ్బులతో మీకు జీతాలు ఇస్తాను అని చెప్పిన సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ ఇప్పుడు ముఖం చాటేసి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎలాగైనా పంచాయతీ సెక్రెటరీ పైన, సర్పంచ్ పైన కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ లేబర్స్ వారి ఆవేదన తెలియ పరిచారు.
