అచ్చంపేటలో కందం తొక్కిన కార్మిక లోకం

*విజయవతమైన దేశవ్యాప్త కార్మిక సమ్మె

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన కార్మికుల సమ్మె అచ్చంపేటలో విజయవంతమైంది ఈ సమ్మెలో ఐఎన్టియుసి,ఏఐఎస్ఎఫ్,ఎఐటియుసి కార్మిక సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అచ్చంపేట అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షుడు మహబూబ్ ఆలీ మాట్లాడుతూ కార్మికుల పొట్టగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు పెత్తందారులకు వత్తాసు పలుకుతూ యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా చేసే కుట్ర చేస్తుందన్నారు. ఆనాడు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1970 సంవత్సరంలో 160 లేబర్ చట్టాలకు చట్టబద్ధత కల్పిస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు కానీ నేటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 12 సంవత్సరాల లోపే అన్ని లేబర్ కోడ్ లు ఎత్తివేస్తూ 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది అన్నారు ఆనాడు ఇందిరా గాంధీ హయంలో 8 గంటలు పని చేయవలసి వస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయంలో 12 గంటలు పని చేయాల్సి వస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వెంటనే కార్మికుల పొట్టగొట్టే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మికలోకం ఏకమై నరేంద్ర మోడీ ప్రభుత్వాని గద్దె దించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ ఆలీ,సిపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు ప్రజా కళాకారుడు గోపాల్, ఎఐటియుసి కార్యదర్శి ఉస్మాన్, యూనియన్ నాయకులు వెంకటేష్ కాజా మియా, చంద్రయ్య, జహంగీర్ నిరంజన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *