సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 13, గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమ వుతుందని సులువాయి గ్రామ కూటమి నాయకులు రాఘవేంద్ర చౌదరి వైష్ణవి రంగస్వామి కే భీమిలింగప్ప చౌదరి కుంబార్ లక్ష్మణ పింజర్ వన్నూరు సాబ్ ఉప్పర్ రమేష్, ఉప్పరి తిమ్మప్ప గంగాధర నాగరాజు లు అన్నారు ఈ సందర్భంగా గురువారం ఆలూరు టిడిపి ఇన్చార్జి శ్రీ వైకుంఠం జ్యోతి ఆర్గనైజర్ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు సులువాయి గ్రామంలోని 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సులువాయి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయనీ గ్రామ ప్రజలు సౌకర్యం కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.