సాక్షి డిజిటల్ న్యూస్ , వేంపల్లె, ఫిబ్రవరి 13 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) దేశంలో అగ్రగామి జీవిత బీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేంపల్లిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కడప రోడ్డులోని మహేష్ స్టూడియోలో టాటా ఏఐఏ లైఫ్ ప్లానర్ కాటం మహేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటం మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అత్యవసరమని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేది బీమా పాలసీలేనని పేర్కొన్నారు. దేశంలో నెంబర్ వన్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా ఏఐఏలో తక్కువ ప్రీమియంతో వివిధ రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ భవిష్యత్తును భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గండి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యుడు పసుపులేటి బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కడప జిల్లా అధ్యక్షుడు కెపి.వెంకట రమణ, శ్రీనివాసులు, సురేంద్ర, శ్రీను, బాబు, పుల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.