సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోండి. డిఎల్పిఓ ప్రసాద్ రావు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 భూమయ్య పిట్లం, . పిట్లం మండలం పిట్లం గ్రామపంచాయతీ పరిధిలో ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ కు ర వెళ్లడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం రావడం జరిగిందని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రసాద్ రావు తెలిపారు. ఉప్పు లక్ష్మయ్యకు చెందిన స్థలంలో సెల్ టవర్ నిర్మాణం చేయడం జరిగిందని ఆ నిర్మాణం కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా చేపట్టడం జరిగిందని ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చామని తెలిపారు. సెల్ టవర్ కు సంబంధించి దస్తావేజులు , ఎలాంటి పత్రాలు పంచాయితీ కార్యాలయంలో లేవని, కేవలం సెల్ టవర్ నిర్మించిన స్థలానికి 6-50/2/1 ఇంటి నంబరే ఉన్నదని, సెల్ టవర్ నిర్మాణం 2008 సంవత్సరంలో నిర్మించడం జరిగిందని అప్పటినుండి ఇప్పటివరకు గ్రామపంచాయతీకి ఎలాంటి ఇంటి పన్ను గానీ, వ్యాపార పన్ను గాని చెల్లించిన దాఖలాలు లేవని ఉప్పు లక్ష్మయ్య వారసులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తెలపాలని పంచాయితీ కార్యదర్శి బలరాంన ఆదేశించారు. జగదాంబ తండా పరిధిలో కొన్ని స్థలాలకు అప్పటి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించడంపై, గవర్నమెంట్ టీచర్ కు గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించడం, అట్టి స్థలంలో టీచర్ ఇంటి నిర్మాణం చేపట్టడం తదితర అంశాలపై విచారణ నిమిత్తం రావడం జరిగిందని విచారణ చేపట్టామని, విచారణలో తేలిన విషయాలను డిపిఓ, జిల్లా కలెక్టర్ నివేదించి చర్యలు చేపడతామని డిఎల్పిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఈవో బలరాం, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *