లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు పోరాడుతాం

సాక్షి డిజిటల్ న్యూస్ 12 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేవరకు ప్రజా పోరాటం కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి వెంకన్న సిఐటియు మండల కార్యదర్శి బి టి దొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు కార్మికులకు వ్యతిరేకంగాకేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలు వందలాదిమంది కార్మికుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నూతన విద్యుత్ బిల్లును రద్దుచేసి కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వి బి జి రామ్ జి పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఉపాధి కూలీలకు బడ్జెట్లో లక్షల కోట్లు కేటాయించాలని 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని అన్నారు అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయం నుండి కాలేజ్ మీదుగా రామాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలి లో మానవ హారంగా ఏర్పడ్డారు సమ్మె విజయవంతం అవడంతో సమ్మెకు సహకరించిన కార్మికులు కర్షకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కే సూరిబాబు జి రాము సృజన జి వెంకటి ఎస్ పద్మ జి వరలక్ష్మి వి గౌరీ సన్యాసమ్మ జయలక్ష్మి కోమలి పద్మ సిహెచ్ జ్యోతి కృష్ణవేణి రమణమ్మ కమల ఈశ్వరమ్మ అవతారం సతీష్ రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *