క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

సాక్షి డిజిటల్ న్యూస్ పిబ్రవరి.13: వేములవాడ ఆర్ సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక పాఠశాల శివనగర్, సిరిసిల్లలో ఒకటవ తరగతి చదివే ఎం. నికేష్ 24డిసెంబర్2025 రోజున నీటి సంపులో పడి మృతి చెందడం జరిగింది. నికేష్ తల్లి లావణ్య క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కుమారుడు చనిపోయి బాధతో కృంగిపోతూ, మరోవైపు మహమ్మారి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. లావణ్య ఆర్థిక పరిస్థితి బాగ లేనందున ఉపాధ్యాయ బృందం 8500 రూపాయలు మరియు ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మానవత దృక్పథం తో ఎవరైనా దాతలు ఉదార స్వభావంతో లావణ్య గారికి సహాయం చేసి ఆదుకోగలరని కోరుతూ,సహాయం చేయదలచిన వారు కింది నెంబర్ కు ఫోన్ పే చేయగలరు. లావణ్య : 7673942449.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *