సాక్షి డిజిటల్ న్యూస్ పిబ్రవరి.13 (గొల్లపల్లి మండల రిపోర్టార్) భైరం నారాయణ ఈ రోజు తేలనున్న అభ్యర్థుల భవిష్యత్తు వాణి హోరా హోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైన నేడు స్పష్టత వస్తోంది. పోలింగ్ సరళి తరువాత పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. మున్సిపాల్టీల్లో పోలింగ్ జరిగిన తీరు. పోలింగ్ శాతంఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. పోల్ మేనేజ్ మెంట్ పైనా సమీక్ష చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమం గా ఫలితాల పైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ జరిగిన తీరు పైన అభ్యర్థులందరూ ఆనందభాష్పాలతో గెలుపుతో ధీమాగా కనిపిస్తున్నారు. మరి కొందరు అయోమయంలో ఉన్నారు. నువ్వ నేనా అనే ఆలోచనలో పడ్డారు. పోలింగ్ సరళికి అనుగుణంగా గెలుపు ఓటముల పైన ఒక అంచనాలకు వస్తున్నాయి. అధికారిక ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.