భీమిలి సమన్వయకర్త చిన్న శ్రీను ఆదేశాలు ను నిర్వర్తించిన పినిశెట్టి సింహాచలం నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) ఫిబ్రవరి 13: భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు సారద్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కు ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతూ శంఖారావం పూరించింది అని ఆనందపురం యువజన విభాగం అధ్యక్షుడు పినిశెట్టి సింహాచలం నాయుడు అన్నారు.అందులో బాగంగా చిన్న శ్రీను అప్పిగించిన పంచాయతీ కమిటీ నియామక బాధ్యతలు ను మండల యస్సి సెల్ అద్యుక్షులు దుమ్మెద అప్పల సూరి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యర్ర అప్పల నాయుడు విశాఖ జిల్లా యస్సి సెల్ ప్రథాన కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ సహాయ సహకారాలు తో 7 అనుబంద కమిటీలలో నూట ఇరవై మంది ని నియమించి పూర్తి చేసి ఈరోజు పార్టీ అధిష్టానం కి సమర్పించడం జరింగింది.ఈ నియామాకాలకు ఐదు పంచాయతీ క్లస్టర్ ఇంచార్జ్ కోరాడ ముసలి నాయుడు పర్యవేక్షకులు గా వ్యవహరించారు. సమన్వయకర్త చిన్న శ్రీను ఆశిస్సులతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపే లక్ష్యంగా మేముతా కలసి పని చెస్తామని,ఆయనను మంత్రి గా చూడాలన్నదే మా కల అని అన్నారు.ఈ కమిటీలలో నియమింపబడిన వారు చిత్తశుద్ధి పని చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *