నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయాలి

*వికాసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు 2025 ను రద్దు చేయాలి *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులతో వంశీ

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిబ్రవరి 13 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం హై స్కూల్ నందు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సారవతీక సమ్మెకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో లో జరిగిన విద్యాసంస్థల బంధు విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూత్రంగా తీసుకొచ్చిన వికాసిత్ భారత్ శిక్షా బిల్లు 2025ను చేయాలనే తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 ను తీసుకువచ్చి పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దుచేసి కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి దీనివల్ల కార్మికులకు ఎంతో పని భారం పెరుగుతుందని ఇవాల్టి విద్యార్థులే ఉద్యోగ స్తులు కాబట్టి దీనివల్ల ఇప్పుడున్న కార్మికులే కాకుండా భవిష్యత్తు తరాలు వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడతారు వారి యొక్క శ్రమని కార్పొరేట్ కంపెనీలు దోపిడీ చేస్తాయి కార్మికులకు ఉండాల్సిన కనీస హక్కులు కూడా లేకుండా పోతాయి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు అనిల్ కుమార్ సాయి తేజ, మండల నాయకులు సీతయ్, అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *