గ్రీన్ వుడ్ స్కూల్ అన్నువల్ స్పోర్ట్స్ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న TPCC కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

సాక్షి డిజిటల్ న్యూస్ మహాదేవపూర్ మండలం 13 ఫిబ్రవరి, (తులసి మహేష్) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ స్కూల్‌లో నిర్వహించిన అన్నువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షిం చారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ హసీనా బాను, అక్బర్ ఖాన్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల,ఉపసర్పంచ్ శ్రీజ*రాష్ట్రాధికార ప్రతినిధి ఎర్రవెల్లి విలాస్ రావు, మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *