శ్రీ దార మల్లేశ్వరస్వామి ఆలయంలో భారీ ఏర్పాట్లు

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, మహాశివరాత్రి ఈ నెల 15,16లో దారమట్టం శ్రీ దార మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద పూజా కార్యక్రమాలు ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి.గురువా రం నర్సీపట్నం డి.ఎస్.పి పి. శ్రీనివాసరావు,రూరల్ సి.ఐ రేవతమ్మ,ఎస్‌.ఐ రామారావు కలసి దేవస్థానం పరిసర ప్రాంతాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్‌ల ఏర్పాట్లు పార్కింగ్ ప్రదేశాల గుర్తింపు ట్రాఫిక్ నియంత్రణ భక్తులకు తాగునీరు సౌకర్యాలు ఇతర మౌలిక సదుపాయాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే ఆలయం పరిసర ప్రాంతాలలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డి.ఎస్.పి ఎస్‌.ఐ బందోబస్తు నిర్వహణ పై పలు సూచనలు అందజేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పోలీస్ సిబ్బందికి సహకరించి క్రమశిక్షణ పాటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *