సమ్మె విజయవంతం !!కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు !!

సాక్షి, డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్ , రాజు కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చి సమ్మె పిలుపు శంకరపట్నం లో గురువారం విజయవంత మైంది, పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై పలు శాఖల మహిళ, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు, కోడ్స్ అమలు చేయకుండా రద్దు చేయాలన్నారు, కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసే వ్యవహారమును విరమించుకోవాలని డిమాండ్ చేశారు, అధికార కేంద్ర ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించుట విరమించుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, అంగన్వాడీ టీచర్లు, పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *