జనం న్యూస్ మునగాల ఫిబ్రవరి 12 : నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని యజమానులు వద్దా బానిసలుగా మార్చే విధంగా ట్రేడ్ యూనియన్ హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి.గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నశించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని రైతాంగ సమస్యను పరిష్కరించాలని రైతు సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి శ్రీరాములు, సిఐటియు జిల్లా నాయకులు బచ్చలకూర స్వరాజ్యం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సీతారాములు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సారెడ్డి రెడ్డి రాఘవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సోంపంగు జానయ్య, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని కొక్కిరేణి రోడ్డు అండర్ పాస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని జీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వర్కర్స్, వివోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణ,హమలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి కనీస వేతనం 26000 నిర్ణయించాలని ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వేతనాలు ఇవ్వాలని సెర్ఫ్ ద్వారా కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భావన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికులకు కల్పించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆరే రామకృష్ణారెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోల ఆంజనేయులు,వెంకటేశ్వర్లు, నాగరాజు, రైతు సంఘం నాయకులు బాలకృష్ణారెడ్డి, జిపి వర్కర్స్ జిల్లా నాయకులు ఎల్. నాగార్జున, ఎం వెంకన్న, హమాలీ వర్కర్స్ నాయకులు ఏ మైసయ్య గౌడ్, బి రవి, రేణుక, ఉదయమ్మ, రాములమ్మ, నాగలక్ష్మి, కెవిపిఎస్ జిల్లా నాయకులు నందిగామ సైదులు, కిన్నెర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
