సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 13 ఫిబ్రవరి 2026 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
గుండాల కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిన దానికి నివసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గుండాల మండలంలో గ్రామపంచాయతీ ఆశా కార్మికులు వివిధ సంఘాల సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మద్దెపురం రాజు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక వ్యతిరేక జీవోలను అమలు చేసి కార్మికుల శ్రమ దోపిడి చేసే విధంగా చట్టాలను చేసిందని దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసన తెలియజేస్తున్నామని అన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులను ప్రభుత్వం గుర్తించి శ్రమ కు దగ్గ ఫలితం అందించాలని అన్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయడం తో సామాన్య పౌరుని పై పెనుబారం పడుతుందని అన్నారు.పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఈ కార్యక్రమంలో, సిపి ఐ నాయకులు ఉప్పుల కొమురయ్య సిపిఐ నాయకులు ఇటిక్యాల పరశురాములు గ్రామపంచాయతీ కార్మికుల నాయకుడు కాసం శోభ ఆశ కార్మికుల మండల నాయకురాలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
