లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసన

*దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శన.

జనం న్యూస్ 12 ఫిబ్రవరి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: మండలంలో సిఐటియు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నాడు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని,జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి 2005 మహాత్మా గాంధీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడాలని, రైతు కౌలు రైతులకు అన్ని రకాల పంటలకు మద్దతు ధర పార్లమెంటులో చట్టం తేవాలని, విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించరాదని, అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దేశం కోసం ప్రజల ప్రయోజనాల కోసం సమ్మె నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు రత్నమయ్య, సిఐటియు మండల నాయకుడు రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్, మండల నాయకుడు రామచంద్రుడు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు వెంకటరమణ,శ్యామలమ్మ, ఆశా యూనియన్ నాయకురాలు సుశీలమ్మ, భాగ్యమ్మ,సువర్ణమ్మ, సంఘం నాయకుడు స్రవంతి, సుబ్బరాయుడు, శిరోమణి, స్వచ్ఛభారత్ కార్మిక సంఘ నాయకుడు ఖాదరయ్య, శీను ఆటో యూనియన్ నాయకుడు ఏసన్న, రాజు, రైతు సంఘం నాయకుడు లింగన్న, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నాయకుడు నాగరాజు ల ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు బస్టాండ్ నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు,ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *