కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన.

సాక్షి డిజిటల్ న్యూస్: 13 ఫిబ్రవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తోందని ఆయన ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి, నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని, వీటిని పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య ఆమోదింప చేసుకున్నారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ లో నోటిఫై చేసి, 2026 ఏప్రిల్ నుండి అమలుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *