జనం న్యూస్ ఫిబ్రవరి/13/2026 ముట్రాజ్ పల్లి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయలీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కొండి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాలరాస్తున్న మోడీ విధానాలను నిరసిస్తూ నేడు తలపెట్టిన కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రీక స ఈ సందర్భంగా ఏఐటీయూసీ మెదక్ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంస్థ ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి. మాట్లాడుతూ నూతనంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత, వేతన హక్కులు, సంఘటిత హక్కులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సంస్థలకు కార్మికులను సులభంగా తొలగించే అవకాశాలు పెరగడం, పని గంటలు పెరిగే అవకాశాలు ఉండటం, కనీస వేతనాల విషయంలో అనిశ్చితి ఏర్పడటం వంటి అంశాలు కార్మిక వర్గానికి పెద్ద ముప్పుగా మారతాయని తెలిపారు. ట్రేడ్ యూనియన్ హక్కులు బలహీనపడే విధంగా రూపొందించిన ఈ చట్టాలు ప్రజాస్వామ్య హక్కులపై కూడా దాడి చేస్తున్నాయని విమర్శించారు.ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు మరియు వలస కార్మికులు అత్యంత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ వేతనాలు, అసురక్షిత పని వాతావరణం, ఆరోగ్య భద్రత లేకుండా జీవిస్తున్న కార్మికులకు ఈ చట్టాలు మరింత భారంగా మారతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు మరియు చిన్న పరిశ్రమల కార్మికులు అత్యధికంగా నష్టపోతారని వివరించారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ విధానాలు, సామాజిక అసమానతల నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ కార్మిక హక్కులను బలహీనపరచడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. కార్మిక వర్గం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పటికీ, వారి జీవన భద్రతను పట్టించుకోకుండా విధానాలు రూపొందించడం సామాజిక న్యాయానికి ప్రమాదకరమని తెలిపింది. కార్మిక సంఘాలతో సంపూర్ణ చర్చలు జరపకుండా చట్టాలను అమలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఉపాధ్యకుడు ఆకుల బిక్షపతి ఉపాధి హామీ కార్మికులతో పాటు 100మంది కార్మికులు పాల్గొన్నారు.
