యూరియా ఎరువు మాయాజాలంలో అధికారులకు తప్పుడు సమాచారం .!!!

సాక్షి, డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 13, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, బూర్ల రాజు. !!! స్థానిక శంకరపట్నం మండల కేంద్రం చెందిన ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని యూరియా ఎరువు మాజాలంలోఅధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వ్యవహారం మండల స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సదరు యజమాని యూరియా మాయజాలములో కీలక పాత్ర పోషించడంపై అధికార వర్గాల్లో అలజడి చెలరేగింది. రెండు రోజుల క్రితం ఫర్టిలైజర్ షాపుకు యూరియాఎరువు రావడంతో రైతులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి యూరియా తీసుకోవడానికి ప్రయత్నించారు, యూప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులు షాపు కాడికి వెళ్లేసరికి, యూరియా స్టాక్ అయిపోయిందని , సదర్ యజమాని తెలపడంతో అగ్రహం చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, దీంతో వ్యవసాయ అధికారులు స్పందించారు,అట్టి షాపును తనిఖీ చేశారు, సదర్ యజమాని పథకం ప్రకారం గా ఇద్దరు వ్యక్తులను తనకి వచ్చిన అధికారులకు యూరియా మాయజాలం కాలేదని తప్పుడు సమాచారం ఇప్పిచ్చిన వ్యవహారంలో రైతులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఈ యజమాని తీరుపై మండలంలో చర్చ కొనసాగుతుంది, అధికారులకు తప్పుడు తవ్వ పట్టించిన కాకుండా తప్పుడు సమాచారం ఇచ్చి గతంలో కూడా వ్యాపారం నిర్వహించినట్లు రైతులు పేర్కొన్నారు, ఈలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను మోసం చేస్తున్న సదరు యజమానిపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు సదరు ఫర్టిలైజర్ యజమాని లైసెన్సును రద్దు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే నిరూపిస్తామని రైతులు వివరించారు, అంతేకాకుండా యూరయా కొరత కు కీలకపాత్ర వహించిన సదరు ఫర్టిలైజర్ షాపు నిర్వాహకునీ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *