16న మహాశివరాత్రి రథోత్సవం విజయవంతం చేద్దాం

*ఈవో అంగదాల కృష్ణయ్య,సర్పంచ్ తిరుపాల్ యాదవ్

జనం న్యూస్ ఫిబ్రవరి 13(రిపోర్టర్ రాజు)శ్రీ జరుట్ల రామలింగేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమం మరియు రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని ఆలయ కార్యనిర్వహణాధికారి అంగదాల కృష్ణయ్య,సర్పంచ్ తిరుపాల్ యాదవ్,అర్చకులు,గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా ఈవో అంగదాల కృష్ణయ్య, సర్పంచ్ తిరుపాల్ యాదవ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరట్ల గ్రామంలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ జరుట్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం15 తేదీన ఉదయం నాలుగు గంటల నుండి పంచామృతాభిషేకం, కలశ స్థాపన జరుగును,రాత్రి 12 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుపబడును,16/02/2026న సోమవారం ఉదయం శ్రీవారికి అభిషేకము, మహా మంగళహారతి తీర్థప్రసాద వినియోగము,సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవము జరుగును,17న మంగళవారం ఉదయం 8 గంటలకు వసంతోత్సవం జరుగుతుందని,కావున భక్తులు పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదమున స్వీకరించి, స్వామివారి కరుణ,కటాక్షముకు పాత్రులు కావాలని తెలియజేశారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *