స్వచ్ఛ రధం నిర్వహణ కోసం దరఖాస్తులు అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వా నించడం జరుగు తోందని

*జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మి తెలియజేశారు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
అమలాపురం జిల్లాలో అంబాజీపేట, రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, ఆత్రేయపురం, అయినవిల్లి, కొత్తపేట, అమలాపురం, ఉప్పలగుప్తం మరియు పి.గన్నవరం మండలాలలో ఒక యూనిట్ గా స్వచ్ఛ రధం నిర్వహణ కోసం దరఖాస్తులు అర్హులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వా నించడం జరుగు తోందని జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలాన్ని ఒక యూనిట్ తీసుకోవడం జరిగిందని కావున విడివిడిగా దరఖాస్తులు చేసుకోవా లన్నారు వర్తించే గరిష్ట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (మోడల్-1 కి రూ.25,000/నెల, మోడల్ II కి రూ.21,000/నెల),దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ (టెండర్ ప్రకటన జారీ చేసిన తేదీ నుండి 7 రోజు ల్లోపుగా నిర్దేశించామ న్నారు స్క్రాప్టిలింగ్, ఘన వ్యర్థాల సేకరణ లేదా పునర్వినియోగపరచదగిన పదార్థాల నిర్వహణలో కనీసం మూడు సంవత్స రాల ధృవీకరించదగిన అనుభవం కలిగి ఉండాల న్నారు స్క్రాప్ లేదా పునర్వినియోగ పరచదగిన పదార్థాల నిర్వహణ కోసం చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్సు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు.దరఖాస్తుదారుడు దరఖాస్తును ఆధార్ పాన్ కాపీ. నివాసం లేదా సంస్థ రిజిస్ట్రేషన్ రుజువు.
అనుభవ ధృవీకరణ పత్రం మరియు సహాయక పత్రా లు సమర్పించాలన్నారు. స్క్రాప్ డీలింగ్/MRF ఆపరేషన్ కోసం ట్రేడ్ లైసెన్స్, కలిగి ఉండాలన్నా రు.GSTరిజిస్ట్రేషన్ వర్తిస్తే గత మూడు సంవత్సరాల టర్నోవర్ స్టేట్ మెంట్ మరియు IT రిటర్ను. సమర్పించాలన్నారు.స్వచ్ఛ రధం కోసం ప్రతిపాదిం చబడిన వాహనం వివరా లు RC కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకర ణ పత్రం, బీమాధృవీకరణ పత్రం, ఫిట్ నెస్ సర్టిఫికేట్ తో పాటుగా బ్యాంక్ పాసుబుక్ ఉమ్మడి ఆపరేషన్ వివరాలు సమర్పించాలన్నారు. అధికారుల నుండి నెలకు వయబిలిటీ గ్యాప్ ఫండిం గ్ పొందడానికి బిడ్డర్ కోట్ చేసిన మొత్తంసీలింగ్ )- పరిమితి మోడల్-1 కి రూ.25,000/-, మోడల్-II కి రూ:21000/-, మించ కూడదన్నారు. పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు సంప్రదింపు వివరాలు సమర్పించాలన్నారు. దరఖాస్తు దారుడు రూ.10,000/- డిమాండ్ డ్రాఫ్ట్ ను MPDO చిరు నామాతో దరఖాస్తు తో పాటు సమర్పించాలని ఈ సొమ్ము తిరిగి చెల్లించబ డదన్నారు.టెండర్ ఆమోదించుటకు గాని రద్దుపరచుటకు గాని మరియు వాయిదా వేయుటకు గాని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి మరియు కన్వీనర్ వారికి పూర్తి అధికారo కలద న్నారు.ఇతర వివరాల కొరకు కార్యాలయపు చరవాణి 9247862775 నందు సంప్రదించవలెననీ ఆమె ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *