కూటమి ప్రభుత్వ పాలనలో రైతాంగం అభివృద్ధి

*రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మునుస్వామి

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, రాష్ట్రంలోఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతన్నకు చేయూతనిస్తోందని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ డైరెక్టర్ మునస్వామి, మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, కామరాజు నాయక్, మాజీ మండలాధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, జిల్లా నేత పట్రా నారాయణ పేర్కొన్నారు. బుధవారం వారు రామకుప్పం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరలతో ఇస్తున్న టర్పాలిన్ పట్టలను పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో ప్రజల సంక్షేమం అన్నదాతా సుఖీభవ పథకం కింద విజయవంతంగా పంపిణీ చేశారని. గత ఐదేళ్ల వైకాపా రాక్షస పాలనలో నలిగిపోయిన రాష్ట్ర రైతాంగం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా పోలవరం కృష్ణ గోదావరి నదుల అనుసంధానం కార్యక్రమం వేగవంతంగా చేపట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సులోచన గురప్ప, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నరసింహులు, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సీతాపతి, రెస్కో డైరెక్టర్ మనోహర్, ఏఎంసి డైరెక్టర్ పవన్ కుమార్, సింగల్ విండో చైర్మన్ మహమ్మద్ రఫీ, క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి,మండల ముఖ్య నేతలు నందా రెడ్డి, ఉమాపతి, మాజీ ఎంపీటీసీ అల్లి శ్రీను,హనుమంతు, భాస్కర్ ,గణేష్, మండల వ్యవసాయ శాఖ అధికారిణి అమృత, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *