కార్మిక సంక్షేమంపై కేంద్రానికి హెచ్చరిక

*వినతిపత్రం సమర్పణ

( జనం న్యూస్ చంటి ఫిబ్రవరి 12) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేసి, పూర్వం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ, కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులు క్షీణిస్తున్నాయని, భద్రతా ప్రమాణాలు తగ్గుతున్నాయని, వేతనాలు మరియు సంక్షేమ పథకాల అమలులో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మరియు లక్ష్మి, సులోచన, రవి, బాలరాజు, నెల్లూరు బాలమణి, యశోద, సరూప, యాదగిరి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, సఫాయి కార్మికులు మరియు వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *