మాజీ కార్పొరేటర్ కళ్లెం జీవన్ రెడ్డి ని సన్మానించిన బంజారా కాలనీవాసులు

జనం న్యూస్ ప్రతినిధి 12 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ :హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీవాసులు నేడు స్థానిక మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కాలనీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవకు కృతజ్ఞతగా ఈ సన్మానం నిర్వహించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీలకు అతీతంగా సేవలందించిన నాయకుడిగా ఆయన నిలిచారని కాలనీవాసులు కొనియాడారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు, యువత కలిసి శాలువా కప్పి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్బంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమ, ఆదరణే తనకు పెద్ద బలం అని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంజ్య, బాలు, వి. బాలు, రాథు, జి. బాలు, బాషా, పంతు, దాసు, ఆనంద్, వెంకటేష్, నాగరాజ్, కిరణ్, శివ, రాజేష్. మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..హయత్ నగర్ డివిజన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *