జనం న్యూస్ 13 ఫిబ్రవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా : రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్ లు మాట్లాడుతూ బాన్సువాడ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను పాల్పడ్డారని పేర్కొన్నారు. రాత్రివేళ బిఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి నాగేందర్, తోట సంగయ్య, నేరుగంటి బాలరాజ్, ఏం సి డైరెక్టర్ షేక్ మహబూబ్, వార్డు మెంబర్ ఇమ్రాన్, సర్పంచ్ కొండల్వాడి శంకర్, గోంటి సాయిలు మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, ఉపసర్పంచ్ షాదుల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నితిన్ పటేల్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.