యర్రగొండపాలెంలో సార్వత్రిక సమ్మె విజయవంతం

సాక్షి డిజిటల్స్ 13.02.2026 మార్కాపురం జిల్లా ( యర్రగొండపాలెం ఆర్ సి ఇంచార్జి ) రాము జి – దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, రైతు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో విజయవంతమైంది. స్ధానిక సీపీఐ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతు, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు చేతిలో కీలుబొమ్మగా మరి కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా విస్తృత మద్దతుతో సార్వత్రిక సమ్మె విజయవంత మైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెవి కృష్ణ గౌడ్, సీపీఐ మండల కార్యదర్శి మన్నె సాంబశివరావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి వై వెంకట శివయ్య, గంగపాలెం శాఖ కార్యదర్శి మొగిలి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి ఆవుల యోగయ్య, మహిళా సంఘం కార్యదర్శి రవణమ్మ, విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *