పయనించే సూర్యుడు ఫిబ్రవరి 02 భీమదేవరపల్లి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ముల్కనూర్ ఎస్సై రాజు సందర్శించారు.. ఈ సందర్భంగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని, మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కాశిరెడ్డి ఆదిరెడ్డి తో మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్, వీధి దీపాలు, మంచినీటి సదుపాయం వంటి కార్యక్రమాలు పై దృష్టి సారించాలని ఎస్సై రాజు సూచించారు.. అనంతరం కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన మంగళ దీపాలతో జాతర ప్రారంభమై, 15వ తేదీన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం, 16వ తేదీన మృత్యుంజయ హోమం, మహా అన్నప్రసాదం వితరణ కార్యక్రమంతో జాతర ముగుస్తుందని తెలిపారు.. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాతర విజయవంతం చేయాలని కోరారు..