ఆదివాసీ(గిరిజనుల)సాంప్రదాయ పండుగ రేల పండగ వాయిదా.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఫిబ్రవరి.04.2026 ఈనెల 6,7 తేదీల్లో జరగవలసిన రేల పండుగ అనివార్య కారణాల వలన వాయిదా వేయటం జరిగింది.ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకులు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని బోడిగూడెం గ్రామం పరగాసానిపాడు గ్రామం డి.రావిలంక గ్రామం ఆర్అండ్ఆర్ కాలనీలలో ఉన్న ప్లేగ్రౌండ్ నందు నిర్వహించ తలపెట్టిన రేల(పండూం) పండుగ రంప ఆదిమ తెగల సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమం అనివార్య కారణాల వలన వాయిదా వేయటం జరిగిందన్నారు.మరల ఎప్పుడు నిర్వహించేదో మీడియా ద్వారా తెలియజేస్తామని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.కావున గ్రామ పెద్దలు కళాకారులు ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు యువతీ యువకులు మరియు విద్యార్థులు మొదలైన వారు రేల పండుగ వాయిదా విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరావు మొదలైనవారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *