సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫార్మ్‌లు అందజేసిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య.

పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 3/సత్తుపల్లి, నియోజకవర్గం: రిపోర్టర్: గద్దె. విజయ బాబు సత్తుపల్లిలో గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకున్నారని, మరోసారి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా ఎగరేలా కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, సత్తుపల్లిని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీలు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *