ముడుపులకు కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ యంత్రాంగా అధికారులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఏన్కూరు సుబాబుల్ లోడు లారీలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు వివిధ ప్రాంతాల్లోనీ పేపర్ మిల్లులకు సుబాబుల్ లోడు లారీలు ఏన్కూరు మండలం మీదుగా నిత్యం వెళుతూ ఉంటాయి ఖమ్మం జిల్లా మండలం లో గ్రామాల నుండి వచ్చే పలు లారీలు అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్నాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు అధిక లోడుతో వెళ్లే వాహనాల వల్ల ద్విచక్ర వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదాలు జరుగుతున్నాయి సుబాబుల్ కర్రలను లారీలో నిర్ణీత ఎత్తు పరిమితి మేరకు, మాత్రమే లోడ్ చేయాలి కానీ వ్యాపారస్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఆగి ఉన్న సుబాబుల్ లోడు వాహనాలను ఢీకొని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఇరువైపులా పొడుచుకు వచ్చేలా ఉండే కర్రలు తగిలి పాదాచారులు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి లోడుతో వెళ్లే లారీలు మోటార్ వాహన చట్టనిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు సుబాబుల్ కర్ర లోడుతో వస్తున్న లారీలకు విద్యుత్ తీగలు తగలకుండా వ్యాపారులు కొంతమంది పొరుగు రాష్ట్ర యువకులను ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఉపయోగించు కుంటున్నారు దాంతో వారు విద్యుత్ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్రలను నిబంధనలకు మించి లోడు చేసి సరిగ్గా కట్టకపోవడం వల్ల తరచూ రోడ్లపై పడుతూ ప్రజలకు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతున్నాయి ఇప్పటికైనా రోడ్డు రవాణా శాఖ అధికారులు పోలీసు శాఖ అధికారులు స్పందించి సుబాబుల్ లోడు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *