రాయికల్ మున్సిపల్‌లో గులాబీ జెండా ఎగరాలి

*దావ వసంత సురేష్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఫిబ్రవరి 03 మామిడిపెల్లి లక్ష్మణ్, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో, జగిత్యాల–రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ–ఫామ్‌లను జిల్లా తొలి తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని విజయం దిశగా నడిపేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాయికల్ మున్సిపల్‌లో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులు: 1వ వార్డ్ – కైరం రమణ, 2వ వార్డ్ – కట్కం రవి, 3వ వార్డ్ – కన్నాక మహేందర్, 4వ వార్డ్ –తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి, 5వ వార్డ్ – వాళ్లకొండ సంధ్య, 6వ వార్డ్ – మజిద తబస్సుం, 7వ వార్డ్ – ఎలిగేటి లతికా
8వ వార్డ్ – బొడసు నవీన్, 9వ వార్డ్ – శ్రీరాముల సువర్ణ, 10వ వార్డ్ – పెండల వనిత, 11వ వార్డ్ – మారంపెల్లి సాయి బాబు, 12వ వార్డ్ – సిర్ప మణిదీప్, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *