కలిమికొండ పారిజాత జనార్దన్ కు బీ ఫామ్ అందజేసిన డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 04. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చండూరు మున్సిపాలిటీ 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిమికొండ పారిజాత జనార్ధన్ కి మాజీ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం బీఫాం అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరంగా చెప్పుతూ వార్డులోని అందరూ ఓటర్లను కలిసి వివరించాలని చెప్పారు. కలిమికొండ పారిజాత జనార్ధన్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను తీర్చుటకు మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అని కోరారు. ప్రధాన సమస్యలు అయినా సిసి రోడ్లు మురికి కాలువలు ఏర్పాటు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *