కోతుల బెడద నివారించేందుకు గార్ల సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ విన్నుత ప్రయోగం…

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల పట్టణ కేంద్రంలో వానరుల కోతుల బెడదను నివారించేందుకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ విన్నుత ప్రయోగం చేయించారు, మంగళవారం గార్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ సిబ్బందితో కొండముచ్చుల వేషధారణ ధరించి వానరులు (కోతుల)ను పట్టణంలోని ప్రధాన రహదారుల నుండి తరిమేశారు ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు సర్పంచ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోయిన కోతులు మళ్లీ వచ్చే అవకాశం ఉందని అవి రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని కోరారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళాలకు ఉచిత బస్సు సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో గార్ల బస్టాండ్‌లో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పరిష్కారం దిశగా గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరామ్ నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బందితో బస్టాండ్ లోని చెత్త చెదారం ను శుభ్రపరిచారు. బస్టాండ్‌లో టాయిలెట్లు మరియు మంచినీటి సౌకర్యం కల్పించే దిశగా ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు మరియు ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్‌లో పరిశుభ్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా గార్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాంబాబు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది బిల్ కలెక్టర్ పిడమర్తి దాసు సిబ్బంది ఎండి సైజాద్ ఆకారపు శ్రీను ఆకారపు కిరణ్ వల్లపుదాసు నరేష్ సింగం ప్రేమ్ బల్లెం సతీష్ వంటెటపాక ప్రభాకర్ మంగలి శ్రీను పిడమర్తి బాబు పిడమర్తి ప్రభాకర్ కాంపాటి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *