జన సంచారంలో పందులు సంచరిస్తే కఠీన చర్యలు

*పందుల పెంపకం దారులకు పుర కమీషనర్ సూచన--


సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ మురళి మంగళవారం స్థానిక పందుల పెంపకం దారులను తన కార్యాలయాలనికి పిలిచి జనసంచారంలో పందులు సంచరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డులో పందులు సంచరిస్తూ రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తింటూ నష్టానికి కలిగిస్తున్నాయని తమకు ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు ఈ విధంగా పందులు సంచరిస్తూ ధాన్యాన్ని తినడం వల్ల రైతు ఆరుగాలం పండించి తెచ్చిన పంట నష్టపోతుందన్నారు ఇకనుండి మార్కెట్ యార్డ్ మరియు జనసంచార ప్రాంతాల్లో పందులు సంచరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కార్యక్రమంలో పుర కమీషనర్ మురళి కౌన్సిలర్లు రమేష్ రావు అప్ప శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *