రైతు ఫోటోతో పాస్ బుక్ పంపిణీ ఘనత సీఎం చంద్రబాబుదే.

*టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు.

సాక్షి డిజిటల్ న్యూస్ :3 ఫిబ్రవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రమేష్ బాబు ( రాము) గత వైకాపా ప్రభుత్వం రైతుల భూముల పాస్ బుక్కులపై జగన్ ఫోటోతో పాస్ బుక్కులు ఇచ్చి సర్వే రాళ్లపై కూడా ఫోటోలు వేసుకొని రైతుల ఆగ్రహానికి గురయ్యారని మా కూటమి ప్రభుత్వం లో రైతు ఫోటోతో ఎలాంటి సమస్యలు లేని పాస్ బుక్కులు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కు దక్కినట్లు రాష్ట్ర టిడిపి బి.సి ఉపాధ్యక్షుడు కొండామర్రి తులసీదర్ నాయుడు ప్రశంసించారు. మంగళవారం మర్రిమాకులపల్లి సచివాలయం లో తాసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులకు నూతన పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భూముల రీసర్వేలో జరిగిన పొరపాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిచేసి రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులు,తులసిధర్ నాయుడు రైతులకు నూతన పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బిజెపి మండల మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, జయచంద్ర నాయుడు, వీఆర్వో వెంకటేష్, సర్పంచ్ జ్యోతి, టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *