అక్నాపూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం… ఘనంగా మైసమ్మ జాతర

*గ్రామ దేవత మైసమ్మ ఆశీస్సుల కోసం భక్తుల తరలింపు *అక్నాపూర్ మైసమ్మ జాతరలో భక్తి పారవశ్యం *సాంప్రదాయ కళలతో అలరించిన మైసమ్మ జాతర *పల్లె సంస్కృతిని ప్రతిబింబించిన అక్నాపూర్ జాతర

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4: నవాబుపేట మండలం తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా,గ్రామ ప్రజల ఆరాధ్యదైవం గ్రామ దేవతలను కొలుస్తారు అందులో భాగంగా మైసమ్మ జాతర భక్తిశ్రద్ధలతో, అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు.నవాబుపేట మండల పరిధిలోని అక్నాపూర్ గ్రామాల్లో సర్పంచ్ కౌకుంట్ల అరుణ బంధయ్య గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మైసమ్మ జాతర ఉత్సవం ఘనంగా జరిగాయి. అమ్మవారికి బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు,డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ మైసమ్మ జాతరకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల బిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి పామేనా భీమ్ భరత్ లు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి చేవెళ్ల నియోజకవర్గం, గ్రామాల ప్రజలు చల్లంగా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు. మైసమ్మ జారతలో భవిష్యవాణికి ఎంతో ప్రముఖ్యత ఉంటుంది. జాతరలో అమ్మవారి వద్ద ప్రత్యేక పందిరి ఏర్పాటుచేసి అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై కొత్తచాటను ఉంచి దానిపై ఎర్పుల అమ్మవారి పూనకంతో భవిష్యవాణిని వినిపించడం సంప్రదాయం కాగా నాటి భవిష్యవాణిలో ప్రకృతి విపత్తుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అమ్మవారి గర్భగుడి వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చీకట్లో ఉంచుతున్నారని, అలా కాకుండా గర్భగుడిని పునరుద్దరించాలని, నిత్యం గండదీపం వెలిగేట్టు చూడాలని సూచించారు. విపత్తులు తొలగిపోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణ బంధయ్య గౌడ్, ఉపసర్పంచ్ బేగరి సంజీవులు, వార్డు సభ్యులు,గ్రామ మాజీ సర్పంచ్ లు,గ్రామ పెద్దలు, మండలానికి చెందిన ఆయా గ్రామాల సర్పంచ్ లు,మండల వివిధ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *