సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు అమలా పురం జిల్లా కలెక్టర్ లో . మంగళ వారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా క్రైసెస్ (సంక్షోభం) నిర్వహణ పట్ల గ్రూప్ సభ్యులతో సమా వేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలు అత్యవసర స్పందన బృందం స్పందించే విధంగా కోటి రూపాయల అంచనా వ్యయం తో బాధితుల రక్షణ పరిక రాలతో ఏర్పా టు చేయను న్నట్లు తెలి పారు. జిల్లావ్యా ప్తంగా ఉన్న పైప్ లైన్లు జియో కోఆర్డినేటర్ తో సహా సాఫ్ట్, కాపీ హార్డ్ కాపీలను శాశ్వ తంగా మూసివేసిన చము రు బావుల వివరాలను కలెక్టరేట్‌కు సమర్పించాలని చమురు సహజ వాయు వుల నిక్షేపాలను వెలికి తీస్తున్న చమురు సంస్థ లకు ప్రతి నిధులకు సూచిం చారు. దీని ప్రకారం గ్యాస్ లీకు బ్లో అవుట్ ప్రాం తాల ను గుర్తించేందుకు సులభ తరం అవుతుందన్నా రు. సేఫ్టీ కనుగుణం గా ఇంటిగ్రే టెడ్ పైప్ లైన్ నిర్మాణాలు ఉండాలన్నారు. రసాయన హానికర పదార్థాలను వెదజల్లే ఫ్యాక్టరీలలో తరచుగా తనిఖీలు నిర్వహించి రక్షణ పరంగా జాగ్రత్తలు మెలుకువలు పాటించేలా యాజమాన్యా లను అప్రమత్తం చేయాల న్నారు. అదేవిధంగా సెన్సా ర్ పరికరాలను అమర్చి రక్షణ వ్యవస్థను బలోపే తం చేయాలన్నారు ఫ్యాక్ట రీల చుట్టుపక్కల ప్రాంత ప్రజలలో విపత్తుల పట్ల అవగాహనను పెంపొం దిస్తూ అప్రమత్తంగా ఉండా లని సూచించాలన్నారు. విపత్తులను పూర్తిగా అడ్డు కోవడం సాధ్యం కాకపోయినా, ముందస్తు ప్రణాళికలు, ప్రజల్లో అవ గాహన, అలాగే ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సమన్వ యం ఉంటే వాటి వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించ వచ్చునన్నా రు. పరిశ్రమల్లో క్రైసిస్ విపత్తుల సందర్భం గా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై జిల్లాస్థాయి సంక్షోభ గ్రూపు సమీక్షలో సమీక్షించారు పరిశ్రమల్లో విపత్తు నివారణ ప్రాము ఖ్యత పరిశ్రమల్లో జీవ నాధారాలను కాపాడుకోవ డానికి భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యవసరమ న్నారు ఫ్యాక్టరీలలో గతం లో జరిగిన ప్రమాదాలు, పునరా వృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా లోపాల ను సరిది ద్దుకోవాలన్నారు.ప్రమాద సంభవిత పరిశ్రమ లలో రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు నిర్వహించి, భద్రతా పరికరాలు అందుబాటు లో ఉన్నాయో లేవో తనిఖీ చేయాలన్నారు. కార్మికు లకు భద్రతా శిక్షణలు, అత్యవసర డ్రిల్స్ నిర్వహించాలన్నారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్లు అప్డేట్ చేసు కోవాలన్నారు.కాలుష్య నియంత్రణ బోర్డు, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా మాక్ డ్రిల్స్లు చేపట్టాలన్నారు .ఈ చర్యలతో పరిశ్రమలు సురక్షి తంగా నడవాలనీ కార్మికుల ప్రాణాలు కాపాడాలన్నా రు.కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించ కుంటే చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా విపత్తు నిర్వహణ ప్రకృతి విపత్తులు సంభవిం చినపుడు సమర్థవంతంగా ఎదుర్కొని నష్టాలను తగ్గిం చాలన్నారు పరిశ్రమలలో రెగ్యులర్ సేఫ్టీ ఆడిట్లు చేపట్టాలన్నారు పరిశ్రమ లలో భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఫ్యాక్టరీస్ యాక్ట్, ప్రకారం రూపొందించిన చెక్‌లిస్ట్ ఆధారంగా తనిఖీలు నిర్వహించా లన్నారు. రసాయన నిల్వ హ్యాండ్లింగ్ అత్యవ సర పరికరాలు,ఎయిర్ ప్యూరిఫై యర్లు, వెంటిలేష న్ సిస్టమ్స్ కార్మికులకు రసాయన హ్యాండ్లింగ్, ఫస్ట్ ఎయిడ్, ఎవాక్యుయేషన్ శిక్షణ ఇవ్వబడిందా ,మాక్ డ్రిల్స్ 6 నెలలకు ఒకసారి నిర్వ హించబడ్డాయా?రిస్క్ అసెస్మెంట్ ప్లాన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ,సాలిడ్ వేస్ట్ మేనే జ్మెంట్ పనిచేస్తున్నది లేనిది తనిఖీ చేయాలన్నా రు.ప్రకృతి విపత్తులు గ్యాస్ లీక్ బ్లో-అవుట్ వంటి అత్యవసర పరిస్థితులు సంభవించి నప్పు డు ప్రజల ప్రాణాలు, ఆస్తి రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నా రు.ఈ సంద ర్భంలో క్రైసిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా అమలవ్వా ల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖలు, పరిశ్రమల విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాల న్నారు.పరిశ్రమల్లో గ్యాస్ లీక్ లేదా బ్లో-అవుట్ ఘటనలు సంభవించినప్పుడు వెంటనే అలర్ట్ వ్యవస్థను అమలు చేసి, ప్రమాద పరిధిలో ఉన్న ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు పరిశ్రమ యాజమాన్యం ముందస్తు భద్రతా చర్యలు, ఎమర్జెన్సీ ప్లాన్లు, మాక్ డ్రిల్స్ తప్పని సరిగా నిర్వ హించాలన్నా రు.ప్రకృతి విపత్తుల సమ యంలో త్వరిత స్పందన బృందాలు సిద్ధంగా ఉండా లన్నారు సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహారం, తాత్కాలిక ఆశ్రయం వంటి సౌకర్యాలు నిరాటంకంగా అందించాలన్నారు.అన్ని శాఖలు తమ తమ బాధ్యతలను స్పష్టంగా అవగాహన చేసుకొని, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు ఎటువంటి నిర్లక్ష్యం సహిం చబడదన్నారు.ప్రజలు కూడా భయాం దోళనకు లోనుకాకుం డా అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలన్నారు. సమిష్టి కృషితో ఏ విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయిం ట్ కలెక్టర్ నిశాంతి డిఆర్ఓ కొత్త మాధవి అదనపు ఎస్పీ ప్రసాద్ ఆర్డిఓ లు పి శ్రీకర్ దేవరకొండ అఖిల డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జీ వి వి.ఎస్ నారాయణ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కే రాంబాబు పరిశ్రమలు చమురు సంస్థల ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
