సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 03, జి.మాడుగుల: ఏజెన్సీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన అవసరమని గిరిజన ఐక్యవేదిక మండల అధ్యక్షుడు కొంతలంగి వెంకటరమణ గురుకులం ఉపాధ్యాయులు తెలిపారు. స్థానిక గురుకులం పాఠశాలలో గిరిజన ఐక్యవేదిక గురుకులం యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు మార్గాల్లో వాహనాలు ప్రయాణించేటప్పుడు ఆర్టీవో ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జీబ్రా లైన్లో పలు సింబల్స్ (గుర్తులు) నిబంధనలు కలిగిన బోర్డులు ఏర్పాటు చేస్తారని వాటిని తప్పక వాహందారులు అనుసరించాల్సి ఉందని వారు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ సింబల్స్ ను ప్రయోగాత్మకంగా తెలియజేశారు స్టాప్ +గో,ఎంట్రీ జిగ్ జాగ్ రోడ్, 30స్పీడ్, టీ జంక్షన్ యూ టర్న్, ముందు కుడివైపు మలుపు, ఎడమ వైపు రోడ్డు మలుపు, టు వేస్ ట్రాఫిక్, డేంజర్ జోన్ ,పార్కింగ్, నో పార్కింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు సంబంధించి గుర్తు లతో వారు అవగాహన కల్పించారు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గమ్యస్థానం చేరుకోవచ్చని వారు వారు తెలిపారు వాహనదారులు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రయాణ సుఖాంతంగా ఉంటుందని వారు అన్నారు ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరమని భవిష్యత్తులో ఎంతగానో దోహదపడుతుందని వారు తెలిపారు