సాక్షి డిజిటల్ 04 వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి మండల వర్తక సంఘం ఆధ్వర్యంలో వర్తక సంఘ జేఏసీ ఆధ్వర్యంలో వర్తక సంఘ నాయకులు మంగళవారం స్థానిక తహసిల్దార్ జి దశరథ, మండల అభివృద్ధి పరిషత్ అధికారి జలంధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గౌడ్, సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డిలకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వర్తక సంఘ మండల అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లాభార్జనే ధ్యేయంగా నాసిరకం వస్తువులను తీసుకువచ్చి వ్యాపార సముదాయాలకు అధిక అద్దెలు చెల్లించడం వల్ల స్థానికులకు వ్యాపారం చేయడానికి అద్దె భవనాలు లేక అప్పుల పాలవుతున్నారని, కావున ఇతర రాష్ట్రాల వారిని కట్టడి చేసి స్థానిక వ్యాపారులకు చేయూతనివ్వాలని స్థానికులను కోరుతున్నా మని, ఇతర రాష్ట్రాల వారు స్థానికంగా వ్యాపారం చేయకుండా అధికారులు కట్టడి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు బాలా చారి, బీసీ సంఘంమండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, గంజి వెంకటేశం,గజ్జల అమరేందర్, లెనిన్, నామాల జగన్, గంజి ఉపేందర్, అప్పిశెట్టి సంతోష్, బడుగు లింగస్వామి, తదితర వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.