వర్ధన్నపేట. సాక్షి డిజిటల్ న్యూస్. రిపోర్టర్ . కుందూరు మహేందర్ రెడ్డి . ఫిబ్రవరి 3 వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని బికే తండా మరియు టీకే తండాల నుంచి కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్తలు నాలుగో డివిజన్ బిజెపి అభ్యర్థి సపవట్ రజిత రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరిని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కండువాలు కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ యువతలో మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని యువత నిర్ణయించుకోవడం భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం చాలా ఆనందదాయకమని యువత మార్పు కోరుకుంటున్నారని అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో యువత భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా ఉందని దీనితో వర్ధన్నపేట మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి గుజ్జ సత్యనారాయణ. జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్. మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ రాయపురం కుమారస్వామి. వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల జోనల్ ఇన్చార్జి మరియు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గందె నవీన్ నాలుగో డివిజన్ ఇన్చార్జి జడ సతీష్. జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. కొండేటి సత్యం. జిల్లా మహిళా మోర్చా నాయకురాలు మంజులరెడ్డి. మాజీ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్. బూత్ అధ్యక్షులు దేవేందర్ . భూక్య శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.