8 వ వార్డు అభివృద్ధికి కూరపాటి జయమ్మను గెలిపించండి

*మాటూరి బాలరాజు *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ మున్సిపాల్టీ అభివృద్ధికి 8 వార్డు బిఆర్ఎస్ బలపచిన సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టితో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు అభ్యర్థించ్చారు. మంగళవారం రోజున మోత్కూర్ మున్సిపాల్టీ లోని 8 వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించ్చారు. ఈ సందర్భంగా ఆయన మాటూరి బాలరాజు మాట్లాడుతూ..మోత్కూర్ మున్సిపాల్టీ సమాభివృద్ధికోసం, ప్రజా సంక్షేమం కోసం సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ప్రజలు అందరించి గెలిపిస్తే ప్రజల పక్షాన మున్సిపాల్టిలో ఉన్న సమస్యలపై పోరాడే అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ బొల్లు యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు, రాచకొండ రాములమ్మ, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, కూరపాటి రాములు, జయమ్మ, బి ఆర్ ఎస్ నాయకులు గంగుల రాములు, ఎలాగందుల సత్యనారాయణ, పసునూరి యాదయ్య, గుండు లక్ష్మి, పోచం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *