పటాన్చెరులో బిఆర్ఎస్ ఎన్నికల హడావుడి

*సింధు ఆదర్శ్ రెడ్డి చేతుల మీదుగా బి ఫారం లా పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గ ప్రతినిధి అరుణ.. పటాన్చెరు నియోజకవర్గ లో రామచంద్ర పురం లో బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సింధు ఆదర్శ్ రెడ్డి చేతులమీదుగా మున్సిపల్ ఎలక్షన్ల అభ్యర్థులకు బి ఫారం లో పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మునిసిపాలిటీకి చెందిన 18 వార్డులు, ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన 26 వార్డుల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బి ఫారం లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంద్రేశం మున్సిపాలిటీ ఇంచార్జ్ గోసుల శ్రీనివాస్ యాదవ్, పటాన్చెరు నియోజకవర్గ వీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి అలాగే పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, సహా స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *