సాక్షి డిజిటల్ న్యూస్ 3 ఫిబ్రవరి 2026 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్, జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను చిన్నరథంపై నగర సంకీర్తనలతో ఘనంగా ఊరేగించారు. శివనామస్మరణతో భక్తి గీతాలు మార్మోగుతుండగా, మహిళా భక్తుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుర వీధుల గుండా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది.