గ్యాస్ డెలివరీ బాయ్స్ కి కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలని ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె… బెజ్జం భూషణం

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు ఫిబ్రవరి 4 2026 ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్యాస్ డెలివరీ బాయ్స్ కు కనీస వేతనం రూ.26,000 /-ఇవ్వాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు కంచికచర్ల మండల కన్వీనర్ బెజ్జం భూషణం విజ్ఞప్తి చేశారు మంగళవారం రాజ్యలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కార్మికులంతా కలిసి సమ్మె నోటీసు అందజేశారు గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ బండలను వినియోగదారులకు అందించడంలో ముఖ్య మైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు గ్యాస్ డెలివరీ బాయ్స్ చాలీచాలని వేతనాలతో బ్రతుకుతు న్నారని వారికి ప్రభుత్వం కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలని కోరారు పీఎఫ్ ,ఈఎస్ఐ చట్టబద్ధమైన సౌకర్యాల్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మిక వర్గం అందరూ ఐక్యంగా కార్మిక చట్టాలు, హక్కులు కాపాడుకునేందుకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కోరారు. సమ్మె నోటీస్ యూనియన్ అధ్యక్షులు జాన్ వెంకయ్య, నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *