టీజీఎస్పీడీసిఎల్ ప్రజా బాట కార్యక్రమంలో పలు సమస్యల పరిష్కారం కార్పొరేటర్ విజయ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ — హైదరాబాద్ – టీజిఎస్పీడీసీఎల్ ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ బీజేఆర్ నగర్, మహాభారత్ నగర్, ఇందిరానగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, న్యూ సిఐబి క్వార్టర్స్, తదితర ప్రాంతాలలో గల సమస్యలను శ్రీమతి విజయ రెడ్డి (కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గము మరియు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్ ఆదేశాలతో టీ జిఎస్పీడీసీఎల్ (డైరెక్టర్ ఆపరేషన్) నరసింహులు , (సిజిఎం మెట్రోజోన్) ప్రభాకర్ , (సెంట్రల్ సర్కిల్ ఎస్ ఈ) చంద్రమోహన్ , డిఇ సెంట్రల్ సర్కిల్ , ఏ డి ఈ , ఏఈ మరియు వారి సిబ్బందితో కలిసి పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ , శ్యాముల్ , కిషోర్ , మహేష్ , ప్రవీణ్ , హరికృష్ణ , వాసు , న్యూ సిఐబి క్వార్టర్స్ మాస్టర్ టాలెంట్ స్కూల్ లైన్ మరియు శ్రీనివాస్ నగర్ లైన్ లో బంచ్ కేబుల్ చెయ్యాలని, వంగిపోయిన స్తంభాలను, మరియు ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంటు స్తంభాలు వెయ్యాలని, శ్రీనివాస్ నగర్ కమిటీ హాల్ తోపాటు ఇతర డి టి ఆర్ ల వద్ద కూడా ఫెన్సింగ్ వేయాలని కోరడం జరిగింది, ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ లో ఇనుప స్తంభాల స్థానంలో సిమెంటు స్తంభాలను వేయాలని కోరడం జరిగింది సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *