మూడవ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా

*మూడవ వార్డులో వీధిలైట్ల ఏర్పాట్లు…. *మరికల్ వార్డు సభ్యులు సురిటి చంద్రశేఖర్…..

సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్, ఫిబ్రవరి 3, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), మరికల్ గ్రామంలోని మూడవ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని మరికల్ గ్రామం మూడు మూడవ వార్డు సభ్యులు సభ్యులు సురిటి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నాడు మరికల్ గ్రామంలోని మూడవ వార్డులోని విద్యుత్ స్తంభాలకు వీధిలైట్లు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో ఆయన మాట్లాడుతూ మూడో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. మంచినీటి సమస్య ఉన్న డ్రైనేజీ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. మూడవ వాడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మూడో వార్డులో ఉన్న వృద్ధులకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మూడవ వార్డు అభివృద్ధికి గ్రామ అధికారులు, మండల అధికారులు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉండాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *